వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ పెద్ద కూతురు స్వప్న పెళ్లి జరగడానికి జూనియర్ ఎన్టీఆర్ కారణమట. ఈ విషయాన్ని స్వప్న స్వయంగా వెల్లడించింది. అశ్వనీదత్ కు ముగ్గురు కూతుర్లు. అబ్బాయిలు లేరు దాంతో ముగ్గురు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. పెద్ద కూతురు స్వప్న ప్రసాద్ వర్మ అనే అతడిని ప్రేమించింది. అయితే తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేకభయపడింది.
దాంతో శక్తి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు తన ప్రేమ విషయాన్ని చెప్పి బాధపడిందట. దాంతో ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో చెప్పు …… ఆలస్యం చేయొద్దు . నేను కూడా మీ నాన్నతో మాట్లాడతాను అని అనడమే కాకుండా షూటింగ్ అయిపోయాక అశ్వనీదత్ ఇంటికి వచ్చాడట ఎన్టీఆర్. స్వప్న ప్రేమ విషయాన్ని చెప్పడంతో వెంటనే కోపం ఆపుకోలేకపోయాడట. అయితే ఎన్టీఆర్ శాంతించేలా చేసాడట. దాంతో కూల్ అయిన అశ్వనీదత్ స్వప్న ప్రేమ వివాహానికి ఒప్పుకున్నాడు. దాంతో స్వప్న పెళ్లి అయ్యింది. ఆమె పెళ్లి కావడానికి కారకుడు ఇలా ఎన్టీఆర్ అన్నమాట.
ఇక అశ్వనీదత్ రెండో కూతురు ప్రియాంక దత్ కూడా ప్రేమ వివాహం చేసుకుంది. అప్పుడు కూడా అశ్వనీదత్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే ఆ తర్వాత కూల్ అయ్యాడు పెళ్ళికి అంగీకరించాడు. ఇంతకీ రెండో కూతురు ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా …… మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ని. మొదట ఆ పెళ్ళికి నిరాకరించినప్పటికీ తర్వాత కూల్ అయ్యాడట. అలా తన ఇద్దరు కూతుర్లు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో మూడో కూతురు ని మాత్రం తన కులంలోనే ఇవ్వాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడట.
Breaking News