
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తారకరత్న కుటుంబాన్ని ఒకానొక దశలో ఆదుకున్నాడు. అయితే ఈ విషయం ఇన్నాళ్లు గోప్యంగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఆనోటా ఈనోటా బయటకు వస్తోంది. తారకరత్న హీరోగా 2002 లో ఒకేరోజున 9 సినిమాలు ప్రారంభమయ్యాయి. ఒకటో నెంబర్ కుర్రాడు ఒక్కటే మంచి విజయం సాధించింది. ఇక మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో తారకరత్న హీరోగా నిలబడలేకపోయాడు.
దానికి తోడు ఇంట్లో వాళ్ళను ఎదురించి అలేఖ్య రెడ్డి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహం అని ఇంట్లో వాళ్ళు కాదనలేదు ….. ఎందుకంటే అలేఖ్య రెడ్డికి అంతకుముందే పెళ్లి అయి విడాకులు అయ్యాయి దాంతో ఆమెతో పెళ్ళికి నిరాకరించారు. ఇంకేముంది ఇంట్లో వాళ్ళను ఎదురించి పెళ్లి చేసుకున్నాడు.
ఒకవైపు ఇంట్లో నుండి బయటకు వచ్చాడు అలాగే చేతిలో పెద్దగా సినిమాలు లేవు అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయి తారకరత్నకు. సరిగ్గా ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ విషయం తెలిసి కొన్నాళ్ల పాటు నెలకు 4 లక్షల రూపాయల చొప్పున అవసరాల కోసం ఇచ్చాడట. ఈ విషయాన్ని తారకరత్న తన సన్నిహితుల వద్ద మాత్రమే పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత తారకరత్న ను ఇంట్లో వాళ్ళు ఆహ్వానించడం , గొడవలు మర్చిపోవడంతో తారకరత్న ఆర్ధిక ఇబ్బందులు తొలగాయి. దాంతో ఎన్టీఆర్ కు తారకరత్నకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.