కళాతపస్వి కె. విశ్వనాథ్ భారతీయ సంస్కృతిని ఇనుమడింప జేసేలా పలు చిత్రాలను రూపొందించారు. శాస్త్రీయ సంగీతం యొక్క మాధుర్యాన్ని , గొప్పతనాన్ని ప్రేక్షకులకు చాటి చెప్పిన మహనీయుడు విశ్వనాథ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కళాత్మక చిత్రాలను అందించి తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు కళాతపస్వి. మొత్తంగా కెరీర్ లో 50 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించగా అవన్నీ కూడా కళాకండాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే అందులో ప్రేక్షకుల మనస్సును గెలిచిన అపురూప చిత్రాల జాబితా ఇలా ఉంది.
1) ఆత్మగౌరవం
2) సిరిసిరిమువ్వ
3) సీతామాలక్ష్మి
4) శంకరాభరణం
5) సప్తపది
6) శృతిలయలు
7) స్వాతి ముత్యం
8) సిరివెన్నెల
9) స్వర్ణకమలం
10) శుభ సంకల్పం
11) సాగర సంగమం
12) స్వయంకృషి
13) సూత్రధారులు
14) జీవనజ్యోతి
15) చెల్లెలి కాపురం
16) శారద
17) స్వరాభిషేకం
18) కాలం మారింది
19) ఓ సీత కథ
20) చిన్ననాటి స్నేహితులు
వీటితో పాటు పలు హిట్ చిత్రాలు విశ్వనాథ్ కెరీర్ లో ఉన్నాయి. ఐదు జాతీయ పురస్కారాలను , అయిదు నంది పురస్కారాలతో పాటుగా 10 ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారు.