కృష్ణ గార్ని హీరోగారు అనీ, అన్నయ్యా అనీ పిలుచుకునేవాడిని. నేను “మనం సైతం”పేరున పేదలకి చేస్తున్న చిరు సాయాలకి బోల్డంత మురిసిపోయేవారు.ఓరోజు వారి ఆఫీస్ కి వెళ్ళి,”అన్నయ్యా మీ చేతులపై అసహాయులకి చెక్కులు ఇద్దామని నా ఆలోచన,టైం ఇవ్వగలరా” అని అడిగా.మరు సెకనులో “రేపు మార్నింగ్ 11కి మన ఇంటిదగ్గర పెట్టుకో” అన్నారు.వెళ్ళా..10.45 కి కిందకి దిగి,”అమ్మకూడా వస్తోంది” అన్నారు.అప్పటికే విజయనిర్మలగారికి బాలేదు.హాల్లో లిఫ్ట్ పెట్టేరు. అమ్మ మెల్లగా వచ్చింది.
హీరో గారు కూల్ గా వెయిట్ చేసారు.వారిద్దరి చేతులమీదుగా నిస్సహాయకులకి”మనం సైతం” చెక్కులు పంపిణీ చేసాం.”ఇప్పుడు ఇచ్చినవి నీ సంస్థ డబ్బు, ఇది నా సాయం..”అంటూ 4 లక్షలు చెక్కురూపంలోఅందచేశారాయన.అదీ ఆయన మనస్తత్వం! నేను చేస్తున్న కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలవటం , నన్ను భుజం తట్టటం, మెచ్చుకోవటం, నీ వెనుక మేమున్నాం అని భరోసా ఇవ్వటం,”మనం సైతం”ని ఎంత నిశితంగా గమనించారో తెలియచేయటం,నమ్మకాన్ని ప్రకటించటం,ధైర్యాన్ని నింపటం …ఇవన్నీ ఒక్క చూపులో చెప్పిన ఆ మహానుభావుడు హీరో క్రిష్ణ! ఆయన మనకి దూరమౌతాడా? ఎప్పటికీ కాడు. కళాబంధువులకు, “మనం సైతం”కుటుంబానికి గుండెల్లో పదిలంగా ఉంటాడు అండగానే!! ..హీరో కృష్ణ గారికి వందనం !!