నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ జరిగింది. బాలయ్య పై పలు కీలక సన్నివేశాలు అలాగే యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇక రెండో షెడ్యూల్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడు. ఇక అందాల భామ శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తోంది. అయితే బాలయ్య సరసన నటించే భామ ఎవరు ? అనే చర్చ సాగింది. పలువురు హీరోయిన్ లను చూసి చివరకు కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఆమధ్య పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది.
ఇక ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే కాకుండా గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమని అంటోంది కాజల్ అగర్వాల్. దాంతో కాజల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య – కాజల్ అగర్వాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉండనున్నాయట ఈ చిత్రంలో.