మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకున్నాడా ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇలా కామెంట్ చేయడానికి కారణం ఏంటంటే …….. కళ్యాణ్ దేవ్ పెళ్ళికొడుకులా తయారవడమే …… అంతేకాదు పెళ్లి కూతురుతో కలిసి ఫోటోలు దిగడం కూడా మరో కారణం అయ్యింది. దాంతో కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకున్నాడా ? అంటూ నెటిజన్లు ఆసక్తి ప్రదర్శించారు.
అసలు విషయం ఏంటంటే …….. కళ్యాణ్ దేవ్ తన స్నేహితుల పెళ్ళికి హాజరయ్యాడు. పెళ్లి వేడుక కావడంతో టిప్ టాప్ గా తయారై వెళ్ళాడు. పెళ్లి కూతురు – పెళ్లి కొడుకులతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చాడు. ఇంకేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఇలా ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. అంతేకాని కళ్యాణ్ దేవ్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.
కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఒక కూతురు కూడా. అయితే కొన్నాళ్ల కాపురం తర్వాత కళ్యాణ్ దేవ్ – శ్రీజ ల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడిపోయారు. కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమాలు కూడా ఆడలేదు దాంతో అటు పెళ్లి ఇటు సినిమాలు దెబ్బకొట్టాయి.