
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. నిర్మాత , తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. దాంతో తీవ్ర విషాదం నెలకొంది. చిత్రపురి కాలనీకి రెండుసార్లు అధ్యక్షుడు గా వ్యవహరించిన కొమర వెంకటేష్ కార్మికులకు ఇండ్లు సమకూరేలా చేసాడు. అలాగే హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో షేర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఆ సినిమా ఆర్ధికంగా దెబ్బకొట్టింది. ఇక అదే సమయంలో మరోసారి చిత్రపురి కాలనీ ఎన్నికల్లో పోటీ చేసాడు కానీ ప్యానల్ ఓడిపోయింది.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొమర వెంకటేష్ కు బైపాస్ సర్జరీ జరిగింది. దానికి తోడు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కొమర వెంకటేష్ దాంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. పలువురు సినీ ప్రముఖులు, కార్మికులు కొమర వెంకటేష్ కు నివాళులు అర్పించారు. వెంకటేష్ స్వగ్రామం మాచర్ల కావడంతో పార్దీవ దేహాన్ని మాచర్లకు తరలించారు.






