లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా చరిత్ర సృష్టించారు. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న కమల్ కు మైల్ స్టోన్ గా నిలిచింది విక్రమ్. అప్పుల్లో ఉన్న ఈ హీరోను ఒక్కసారిగా అప్పుల ఊబి నుండి బయటపడేసిన చిత్రం కూడా విక్రమ్ కావడంతో ఒక్కసారిగా కమల్ లో ఎక్కడలేని ఉత్సాహం ,ఊపు వచ్చాయి.
దాంతో మూడేళ్ళ క్రితం ప్రారంభమై తీవ్ర మనస్పర్థలతో ఆగిపోయిన భారతీయుడు 2 మళ్ళీ సెట్స్ మీదకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్ లోకి కమల్ హాసన్ అడుగు పెట్టారు. ఇక ఈ సినిమా కోసం కమల్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట దాంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
ఎందుకంటే కమల్ హాసన్ ఇంత డిమాండ్ చేయలేదు ఎప్పుడు కూడా. కానీ తన సాటి హీరోలు కూడా పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దానికి తోడు విక్రమ్ రూపంలో భారీ హిట్ అందుకున్నారు కమల్ దాంతో 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకున్నారట. ఇంకేముంది కమల్ హాసన్ సెట్స్ లో అడుగుపెట్టారు. భారతీయుడు 2 షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే కాజల్ అగర్వాల్ ఈ సెట్స్ లో అడుగు పెట్టనుందట.