సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సంచలన చిత్రం ” చంద్రముఖి ”. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది. కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ చంద్రముఖి 2 చిత్రం సెట్స్ పైకి వెళుతోంది. అయితే హీరోగా రజనీకాంత్ నటించడం లేదు. రజనీకాంత్ కాకుండా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఇందుకు రజనీ ఆశీస్సులు కూడా ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో మహారాజు దర్బార్ లో డ్యాన్సర్ పాత్ర కీలకం అనే విషయం తెలిసిందే. చంద్రముఖిలో జ్యోతిక నటించిన విషయం విదితమే ! కాగా ఈ చంద్రముఖి 2 లో మాత్రం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ , హాట్ భామ అయిన కంగనా రనౌత్ ని ఎంపిక చేసారు. ఇక కంగనా కూడా చంద్రముఖి 2 లో నటించడానికి సంతోషంగా ఒప్పుకుందట.
ప్రస్తుతం కంగనా రనౌత్ ఇతర సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే చంద్రముఖి 2 లో అడుగు పెట్టనుంది. సహజంగానే కంగనా రనౌత్ మంచి డ్యాన్సర్ కావడంతో ఈ పాత్ర కోసం ఎంపిక చేశారట. అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగు వేయని భామ ఈ కంగనా దాంతో చంద్రముఖి 2 లో అందాల ఆరబోతతో పాటుగా పెర్ఫార్మెన్స్ కు కావాల్సినంత అవకాశం ఉందట. రజనీకాంత్ చంద్రముఖి లో మ్యాజిక్ చేసాడు. మరి ఆ మ్యాజిక్ లారెన్స్ వల్ల అవుతుందా ? అన్నది సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.