తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హీరో కత్తి కాంతారావు. హీరోగా అసలు పేరు కాంతారావు కానీ కత్తి కాంతారావు గా పేరు పొందడానికి కారణం ఏంటో తెలుసా……….. జానపద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా కాంతారావు నిలవడమే. ఒకప్పుడు హీరోగా ఎన్టీఆర్ , అక్కినేని ఎంత ఫేమసో……. కాంతారావు కూడా అంతే ఫేమస్ . కానీ ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ , అక్కినేని లకు లభించిన ప్రాచుర్యం కాంతారావుకు లభించలేదు.
ఇదే ఆవేదన వెలిబుచ్చారు కాంతారావు కొడుకులు. ఫిల్మ్ ఇండస్ట్రీ మాకు ఎలాంటి సహాయం అందించలేదని సంచలన ఆరోపణలు చేశారు. మేము ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని , కిరాయి ఇంట్లో ఉంటున్నామని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మాకు ఉండటానికి ఇల్లు ఇప్పించాలని కోరారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.