
ఓ కన్నడ సినిమా అందునా చిన్న సినిమా బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది. 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇక 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. 5 రోజుల్లోనే 170 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు. కాంతార చిత్రానికి కన్నడ భాషల్లో తప్ప మిగతా చోట్ల పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. అయినప్పటికీ మౌత్ టాక్ తో కాంతార రికార్డుల మోత మోగిస్తోంది.
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తుండటంతో కాంతార ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తున్నారు ఇప్పుడు. ఇక ఈ చిత్రం సాధిస్తున్న విజయానికి పొంగిపోతోంది సాలిడ్ అందాల భామ అనుష్క. ఈ భామకు ఈ సినిమాతో సంబంధం లేకపోయినప్పటికీ కన్నడ సినిమా కావడం అలాగే శెట్టి హీరో కావడంతో కాబోలు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
కాంతార సినిమా అవలీలగా 200 కోట్లు దాటుతోంది. ఇంకా ఎక్కువ సాధించినా ఆశ్చర్యం లేదు. కాకపోతే రేపు నాలుగు సినిమాలు విడుదల అవుతుండటంతో కొన్ని చోట్ల కాంతార చిత్రాన్ని లేపేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ సినిమాలు బాగుంటే ఫరవాలేదు కానీ బాగోలేకపోతే మాత్రం మళ్లీ కాంతార చిత్రాన్ని వేయడం ఖాయం.