నటసింహం నందమూరి బాలకృష్ణను హెచ్చరించింది కాపునాడు. ఈనెల 25 లోపు అంటే రేపటి లోగా ఎస్వీ రంగారావుకు క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు కాపు నాడు నాయకులు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన మహనీయులు ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీ రంగారావు అలాంటిది అక్కినేని , ఎస్వీ రంగారావు గార్లను అవమానించడం బాలయ్య కు భావ్యం కాదని, ఎస్వీ రంగారావు ను అవమానించారని….. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తక్షణమే బాలయ్య క్షమాపణ చెప్పకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలయ్య ఆ రంగారావు ఈ రంగారావు , అక్కినేని …… తొక్కినేని అంటూ ఫ్లో లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలయ్య వ్యాఖ్యలు దిగ్గజ నటులను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కినేని అభిమానులు కూడా బాలయ్య కు వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామన్నారు. నాగచైతన్య, అఖిల్ లు కూడా పరోక్షంగా బాలయ్య వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఎస్వీ రంగారావు మా కమ్యూనిటీ కి చెందిన గొప్ప వ్యక్తి కాబట్టి కాపు నాడు బాలయ్య వ్యాఖ్యలను సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈ విమర్శలపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.