కండక్టర్ ఝాన్సీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఝాన్సీ తన బృందంతో పలు షోలలో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. డ్యాన్స్ షోల తోనే కాకుండా జబర్దస్త్ లో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పలు స్కిట్ లు చేసి అలరించింది.
రమేష్ మాస్టర్ నేతృత్వంలో మేమంతా కష్టపడి మా టాలెంట్ నిరూపించుకుంటున్నామని , అయితే మా ట్రూప్ లో పని చేస్తున్న వాళ్లంతా పేద , మధ్య తరగతికి చెందిన వాళ్ళం కాబట్టి ఇన్సూరెన్స్ చేయించుకోలేక పోయామని…… ఎవరి జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో తెలియని విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. JSW & Jaiswaraajya కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది ఝాన్సీ.
ఈ కార్యక్రమాన్ని లక్షల్లో చూసారు జనం. దాంతో హన్మకొండ ప్రాంతానికి చెందిన కాయిత ఇంద్రసేనా రెడ్డి స్పందించారు. దాదాపు 200 మంది వరకు నేనే ఇన్సూరెన్స్ చేయిస్తానని JSW & Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు హామీ ఇవ్వడమే కాకుండా అన్ని వివరాలు సమర్పించాలని కోరారు.
కండక్టర్ ఝాన్సీగా పేరుగాంచిన ఝాన్సీ తన బృందానికి JSW & JaiSwaraajya యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఇన్సూరెన్స్ పొందుతుండటం పట్ల JSW & JaiSwaraajya అధినేత జై యలమంచిలికి అలాగే ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.