
మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన భామ కీర్తి సురేష్. పక్కింటి అమ్మాయిగా , సంప్రదాయానికి చీర కడితే అది కీర్తి సురేష్ అనేట్లుగా అనిపించింది. కట్ చేస్తే అలాంటి వాళ్లందరికీ షాక్ ఇచ్చింది. థాయ్ ల్యాండ్ లో అందాలను ఆరబోసి షాక్ ఇచ్చింది. స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో పిచ్చ షాక్ ఇచ్చింది కీర్తి.
థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తి సురేష్ ఇలా అందాలను కూడా ఆరబోస్తుందా ? నిజమా ? అని తమ కళ్ళను తామే నమ్మడం లేదు నెటిజన్లు. గ్లామర్ పాత్రలను పోషించడానికి కూడా సిద్ధమని అంటోంది కానీ కీర్తి సురేష్ కు గ్లామర్ పాత్రలు సెట్ కావనే పలువురు దర్శక నిర్మాతలు అలాంటి పాత్రలను ఇవ్వడం లేదు.
మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు ప్రాణం పోసింది. అయితే ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పలు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కానీ అవి అంతగా ఆడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లెలు పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్.
View this post on Instagram