
గ్లామర్ పాత్రలను పోషించాలని తహతహలాడుతోంది మహానటి ఫేమ్ కీర్తి సురేష్. అయితే దురదృష్టవశాత్తు దర్శక నిర్మాతలు తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఇవ్వడంతో చాలా బాధపడుతుందట. అంతేకాదు పలువురు రచయితలు కూడా తన కోసం అలాంటి పాత్రలను రాస్తున్నారని వాపోతోంది. అసలు విషయం ఏంటంటే కీర్తి సురేష్ కు గ్లామర్ పాత్రల్లో నటించాలని చాలా ఆసక్తిగా ఉందట.
అందుకే ఇటీవల కాలంలో వరుసగా ఫోటో షూట్ లు చేస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది కీర్తి సురేష్. అందాలను ఆరబోస్తూ వరుసగా ఫోటో షూట్ లు చేస్తోంది. ఈ భామ అందాలను చూస్తూ కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ఇదేంటి మహానటి భామ ఇలా రెచ్చిపోతోంది అని షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ ఇలా అందాల ప్రదర్శన చేయడానికి కారణం ఏంటో తెలుసా …… గ్లామర్ పాత్రలు రావాలనే.
ఇటీవలే నాని సరసన దసరా చిత్రంలో నటించింది కీర్తి సురేష్. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. అలాగే కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. దసరా చిత్రంలో కీర్తి సురేష్ హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. డీ గ్లామర్ , సిస్టర్ , పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే కాదు గ్లామర్ పాత్రలు కావాలని ఆశిస్తోంది పాపం. మరి ఆ పాత్రలు ఇచ్చేది ఎవరో ?.






