
మహానటి చిత్రంతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న భామ కీర్తి సురేష్. అయితే ఆ సినిమా తర్వాత ఈ భామ పలు చిత్రాల్లో నటించింది కానీ అవి అంతగా ఆడలేదు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈ భామ లుంగీ డ్యాన్స్ తో అదరగొట్టింది. నేను క్లాస్ మాత్రమే కాదు ఊర మాస్ కూడా అని స్పష్టం చేసింది ఈ డ్యాన్స్ తో . లుంగీ పిక్కలపైకి ఎత్తి మరీ డ్యాన్స్ చేసింది. ఇక కీర్తి సురేష్ పిక్కల బలం చూసి హుషారెత్తి పోతున్నారు కుర్రాళ్ళు.
కీర్తి సురేష్ అనగానే సహజంగానే అమాయకమైన ఆడపిల్ల అని అనుకోవడం సహజం. అయితే తనకు అలాంటి ఇమేజ్ ని ఆపాదించిన వాళ్లకు సమాధానం చెప్పాలనే భావనతోనే కావచ్చు ఇలా అందాల ప్రదర్శన చేయడమే కాకుండా ఊర మాస్ తనలో కూడా ఉందని చాటి చెప్పిందన్న మాట. సినిమాల్లో అయితే నటిస్తోంది కానీ కమర్షియల్ సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు పాపం ! ఈ భామకు. అందుకే ఇలా రచ్చ చేసింది.