మహానటి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం నాకు తెలుసు అంటూ షాక్ కు గిరి చేసింది. కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం నాకు పలువురు హీరోయిన్ లు , ఇతర నటీమణులు చెప్పారని , అలాంటి కొన్ని సంఘటనలు కూడా చూశానని …… అయితే నాకు మాత్రం అలాంటి సంఘటనలు ఏవి కూడా ఎదురు కాలేదని స్పష్టం చేసింది.
కాస్టింగ్ కౌచ్ అనేది కొందరి ప్రవర్తన వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చని , నాకు మాత్రం అలాంటి సంఘటనలు ఎదురు కాలేదని , ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే …… సినిమాలు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటానని అంతేకాని అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ కు మాత్రం ఒప్పుకోనని స్పష్టం చేసింది. మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కించుకోలేక పోయింది. అయితే మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రం మాత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది కానీ ఈభామకు అదనపు ప్రయోజనం మాత్రం లేకుండాపోయింది. తాజాగా రెండు పాన్ ఇండియా చిత్రాలను అంగీకరించింది.