యువ దర్శకుడు వెంకటేష్ మహా KGF సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. KGF అనేది ఒక సినిమానా ? అది ఓటీటీ సినిమా ? తల్లి కోరిక అంటూ అర్ధం పర్థం లేకుండా తీసిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఏంటి ? అంటూ చాలా చులకనగా మాట్లాడాడు. అయితే KGF సినిమాను తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటే పక్కనే ఉన్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సహా మరికొందరు నవ్వుతూ ఉన్నారు.
ఇక నందిని రెడ్డి అయితే పగలబడి మరీ నవ్వింది. ఇంకేముందు కన్నడిగులు అలాగే నెటిజన్లు వెంకటేష్ మహా పై అలాగే నందిని రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఆ విమర్శల జడివాన తట్టుకోలేక వెంటనే క్షమాపణ చెప్పింది నందిని రెడ్డి. తన అభిప్రాయం ఏంటో చెప్పడానికి ట్రై చేసింది కానీ నెటిజన్ల విమర్శల ముందు తలవంచక తప్పలేదు.
ఇక వెంకటేష్ మహా ను కూడా ఒక ఆట ఆడుకున్నారు నెటిజన్లు. తనని అదేపనిగా ట్రోల్ చేస్తుండటంతో వెంకటేష్ కూడా వివరణ ఇచ్చుకున్నాడు. అయితే KGF విషయంలో నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు కాకపోతే విమర్శలు ఆ స్థాయిలో చేయొద్దని మాత్రమే తెలుసుకున్నాను అంటూ వివరణ ఇచ్చాడు. దీనిపై కూడా మరిన్ని ట్రోల్స్ రావడం ఖాయం. ఎందుకంటే KGF పై నేను చేసిన విమర్శలు సరైనవే అని అంటున్నాడు మరి.
వెంకటేష్ మహా విమర్శలను పక్కన పెడితే …… KGF , KGF 2 చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారీ వసూళ్లను కట్టబెట్టారు. వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. నేను మంచి చిత్రాలకు దర్శకత్వం వహించాను …… అలాంటి సినిమాలకు కాకుండాKGF లాంటి చిత్రాలకు ప్రేక్షకులు వసూళ్లు కట్టబెడుతున్నారు అంటూ విమర్శిస్తున్నాడు. దాంతో అక్కసుతోనే ఇలా మాట్లాడుతున్నాడు అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు.