ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షల విరాళం ప్రకటించాడు డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ బెంగుళూర్ లో స్థిరపడినప్పటికీ అతడు తెలుగువాడు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామానికి చెందిన వాడు ప్రశాంత్ నీల్.
ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు , మాజీ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అన్న కొడుకే మన ప్రశాంత్ నీల్. రఘువీరా రెడ్డి అన్న సుభాష్ రెడ్డి కొడుకు పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం. ఆ ప్రశాంత్ నీలకంఠాపురం కాస్త బెంగుళూర్ వెళ్ళాక ప్రశాంత్ నీల్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలోనే ఉండేవాడు. ఆమధ్య చనిపోయారు. దాంతో తండ్రి కర్మకాండలకు ఇక్కడికే వచ్చాడు ఈ డైరెక్టర్.
తాజాగా ఆగస్టు 15 న మరోసారి నీలకంఠాపురం కు వచ్చాడు ప్రశాంత్ నీల్. ఆగస్టు 15 న మరణించిన తన తండ్రి జయంతి కావడంతో ఆ సందర్బంగా అనంతపురం జిల్లా నీలకంఠాపురం లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నాడు ఈ డైరెక్టర్. ఆ ఆసుపత్రి నిర్మాణం కోసం ఏకంగా 50 లక్షల విరాళం ఇచ్చాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ బాబాయ్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడించడం విశేషం.
Breaking News