సీనియర్ నటి ఖుష్భు ఆసుపత్రిలో చేరడం చికిత్స పొందుతుండటంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైగా ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఖుష్భు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేసరికి ఆమెకు ఏమైంది అంటూ వాకబు చేయడం మొదలుపెట్టారు. అయితే అలాంటి తన అభిమానులను ఊరడించాలనే ప్రయత్నం చేసింది ఖుష్భు.
కొన్ని రోజులుగా నేను వెన్ను నొప్పితో బాధపడుతున్నానని , ఆనొప్పి ఇటీవల ఎక్కువ కావడంతో భరించలేక ఆపరేషన్ కోసం చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. శస్త్ర చికిత్స పొందిన అనంతరం ఈరోజే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యానని , కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత మళ్ళీ యధావిధిగా నా కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ ప్రకటించింది.
90 వ దశకంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఖుష్భు. ఈ భామ అందాలకు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. దాంతో తమిళనాట ఏకంగా ఈ భామకు గుడి కట్టించారు. అప్పట్లో ఖుష్భు గుడి చాలా ఫేమస్. తమిళ చిత్రాల్లోనే కాదు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడేమో రాజకీయలలో చాలా బిజీగా ఉంటోంది.