kiara advani romance with charan in newzealandన్యూజిలాండ్ లో రొమాన్స్ చేస్తున్నారు కియారా అద్వానీ – రాంచరణ్ తేజ్. ఈ ఇద్దరూ రొమాన్స్ చేయడానికి ఇండియాలో చోటు దొరకలేదనుకుంటా ఎంచక్కా న్యూజిలాండ్ వెళ్లారు. అసలే చలి వాతావరణం కావడంతో మరింత ఘాటు రొమాన్స్ చేయచ్చని భావించారేమో అందుకే న్యూజిలాండ్ చెక్కేశారు. చరణ్ – కియారా ఇద్దరు కూడా న్యూజిలాండ్ వెళ్లారు అయితే రియల్ గా రొమాన్స్ చేయడం కోసం కాదు సుమా ! సినిమా కోసం.
ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో చరణ్ – కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉంది చిత్ర బృందం. ఒక పాటను అలాగే కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. చిత్రీకరణ పూర్తి కావడంతో పేకప్ చెప్పేసి ఇండియాకు బయలుదేరుతున్నారు.