
దివంగత సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ ఈనెల 27 న హైదరాబాద్ లో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు హీరో మహేష్ బాబు. ఇటీవల కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ తో అభిమానులకు విడదీయలేని అనుబంధం ఉంది . దాంతో పెద్ద కర్మకు కృష్ణ అభిమానులను ఆహ్వానించాడు మహేష్ బాబు.
ఇప్పటికే అభిమానులకు అందరికీ ఆహ్వానం అందింది. వాళ్ళ కోసమే హైదరాబాద్ లో పెద్ద కర్మ ఏర్పాటు చేస్తున్నాడు. కృష్ణ అస్థికలను దేశ వ్యాప్తంగా పలు పవిత్ర నదీ జలాలలో కలపాలని భావించాడు మహేష్ బాబు. అందులో భాగంగానే ఇప్పటికే పలు ప్రాంతాల్లో కృష్ణ అస్థికలను నిమజ్జనం చేసాడు కూడా. పెద్ద కర్మ కావడంతో కృష్ణ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి రానున్నట్లు తెలుస్తోంది.