సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు లను పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 28 న కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కృష్ణ , మహేష్ లను పరామర్శించారు చిరు కానీ స్వయంగా వెళ్ళలేదు నిన్న.
ఎందుకంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 28 న అనంతపురంలో జరిగింది. కాబట్టి ఆ వేడుకకు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో నిన్న మహేష్ – కృష్ణ లను పరమరించలేకపోయారు. దాంతో ఈరోజు ఫిలింనగర్ లోని మహేష్ బాబు ఇంటికి వెళ్లి కృష్ణ – మహేష్ బాబు లను పరామర్శించారు. ఇందిరాదేవి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ – మహేష్ బాబు లతో కొద్దిసేపు ముచ్చటించారు.