మహేష్ బాబు హీరోగా నటించిన ఓ సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించాడు. ఇంతకీ కృష్ణ చెప్పిన అట్టర్ ప్లాప్ మూవీ ఏదో తెలుసా …….. ”నాని ” అనే సినిమా గురించి. తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజుల నిర్మించింది.
మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు కృష్ణ కు చూపించారు. మహేష్ సినిమాలను ముందే చూసి హిట్ అవుతుందా ? ప్లాప్ అవుతుందా చెప్పేవాడు కృష్ణ. దాంతో నాని సినిమాను చూసి ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని , అలా అయితేనే మహేష్ స్టార్ హీరో అవుతాడని ఒకవేళ అలా కాకుండా నాని హిట్ అయితే మహేష్ మాత్రం స్టార్ హీరో కాలేడు అని కుండబద్దలు కొట్టాడట.
కట్ చేస్తే మహేష్ బాబు నటించిన నాని చిత్రం విడుదల అయ్యింది …… అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో పెద్ద మొత్తంలోనే నష్టాలు వచ్చాయి. అయితే కృష్ణ చెప్పినట్లుగానే జరిగింది. ఆ తర్వాత మహేష్ పోకిరి సినిమాలో నటించడం అది బ్లాక్ బస్టర్ కావడంతో మహేష్ స్టార్ హీరో అయ్యాడు. కృష్ణ కు పలు చిత్రాలు హిట్ అవుతాయా ? లేదా ? అనేది ఎక్కువగా చెప్పేవాడట. ఎందుకంటే 350 కి పైగా చిత్రాల్లో నటించడం …… ప్రేక్షకుల నాడి పసిగట్టడం వల్లే అని అంటున్నారు.