
క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కృష్ణవంశీ. అయితే గతకొంత కాలంగా ఈ దర్శకుడు రేసులో లేకుండాపోయాడు. వరుస ప్లాప్ లతో కెరీర్ అగమ్యగోచరంగా ఉన్న సమయంలో తీసిన సినిమా ” రంగమార్తాండ ”. ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం , అనసూయ , రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రంలో.
దాదాపు మూడేళ్ళ పాటు షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంది ఈ చిత్రం. తాజాగా పలువురు దర్శకులకు అలాగే సినిమారంగంలోని ప్రముఖులకు ఈ రంగమార్తాండ చిత్రాన్ని ప్రదర్శించారు దర్శకులు కృష్ణవంశీ. ఈ సినిమా చూసిన వాళ్ళు మరో మాట లేకుండా యునానిమస్ గా సూపర్ హిట్ అని అంటున్నారు. అద్భుతమైన స్పందన వస్తోంది ఈ చిత్రానికి.
రంగమార్తాండ చిత్రంలో స్టార్స్ లేకపోవడంతో ఇలా ప్రీమియర్ షోలు వేస్తున్నాడు కృష్ణవంశీ. ఇలా ప్రీమియర్ షోలు వేయడం ద్వారా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుందని , దాంతో తన సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం ల నటనకు ఫిదా అవుతున్నారు సెలబ్రిటీలు. బ్రహ్మానందం నటన చూసి కన్నీళ్ల పర్యంతం అవ్వడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు చాలా ఫీల్ గుడ్ మూవీ అంటూ కృష్ణవంశీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
త్వరలోనే మంచి డేట్ చూసుకొని సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. రంగమార్తాండ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కడంతో ఈ చిత్ర హక్కుల కోసం పోటీ ఎక్కువయ్యింది. కాగా ఆ పోటీలో బ్లాక్ బస్టర్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రంగమార్తాండ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.