ఈరోజు దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరులో జరుగనుంది. కృష్ణంరాజు స్వస్థలం మొగల్తూరు అనే విషయం తెలిసిందే. దాంతో కృష్ణంరాజు సంస్మరణ సభ అక్కడ ఏర్పాటు చేశారు డార్లింగ్ ప్రభాస్. ఇక ఈ సభకు ఏకంగా లక్ష మందికి పైగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొగల్తూరు కు భారీ ఎత్తున తరలివచ్చారు రెబల్ స్టార్ అభిమానులు. దాంతో అందరికీ 25 రకాల వంటకాలలో భారీ భోజనాన్ని ఏర్పాటు చేశారు ప్రభాస్.
కృష్ణంరాజు భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. పైగా తన మెనూలో రకరకాల మాంసాహార వంటకాలు ఉంటాయి. అందుకే ఈ సంస్మరణ సభకు వచ్చే వాళ్లందరికీ 25 రకాల నాన్ వెజ్ వంటకాలను ఏర్పాటు చేశారు ప్రభాస్. ఇక ఈ సమావేశానికి లక్ష మందికి పైగా హాజరు కానున్నారని తెలుస్తోంది.
కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు కాబట్టి మొగల్తూరు లో జరిగే సంస్మరణ సభకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభాస్ ఇప్పటికే మొగల్తూరు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బంధువులు, మిత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. మొగల్తూరు పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది ఈ సంఘటనతో.