డార్లింగ్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ” ప్రాజెక్ట్ – K ”. మహానటి వంటి క్లాసిక్ హిట్ ను అందించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. లెజెండ్ అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకోన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుండి అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
డార్లింగ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలని భావించిన నాగ్ అశ్విన్ స్క్రాప్ వీడియో అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసాడు. ప్రాజెక్ట్ – K కోసం యూనిట్ సభ్యులు ఎంతగా కష్టపడుతున్నారో వివరించే ప్రయత్నం చేసాడు. ఎన్నో ఇబ్బందులు , చిరాకులు పడినప్పటికీ మొత్తానికి ఈ సినిమాలో కీలకమైన భారీ టైర్ ను కస్టపడి ఎంత అందంగా రూపొందించారో చెప్పే ప్రయత్నం చేసాడు.
ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ లను జరుపుకున్న విషయం తెలిసిందే. అమితాబ్ కు సంబందించిన షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసారు. దీపికా పదుకోన్ – ప్రభాస్ ల మధ్య కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈరోజు డిసెంబర్ 31 కావడంతో డార్లింగ్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలని భావించి ఈ వీడియో రిలీజ్ చేసారు.
Starting our making series at the end of the year…
Here’s the sneak peek into our world. #ProjectK
‘𝐅𝐫𝐨𝐦 𝐒𝐤𝐫𝐚𝐭𝐜𝐡 𝐄𝐩 𝟏: 𝐑𝐞-𝐈𝐧𝐯𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐖𝐡𝐞𝐞𝐥’: https://t.co/SjZmt5mPpD#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/oCupUpc5Am
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 31, 2022