25.1 C
India
Wednesday, March 22, 2023
More

    లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానుందా ?

    Date:

    lavanya tripathi called varun tej most handsome hero
    lavanya tripathi called varun tej most handsome hero

    హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు కానుందా ? అవుననే అంటున్నారు గుసగుసరాయుళ్లు. గతకొంత కాలంగా లావణ్య త్రిపాఠి – మెగా హీరో వరుణ్ తేజ్ డేటింగ్ లో ఉన్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకు , ఊహాగానాలకు ఊతమిచ్చేలా మెగా ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే ఆ వేడుకకు లావణ్య హాజరౌతూ వస్తోంది. అంతేకాదు వరుణ్ తేజ్ సిస్టర్స్ తో బాగా కలిసిపోయింది కూడా దాంతో తరచుగా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు.

    ఇక తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కోసం లావణ్య త్రిపాఠి పాల్గొంది. ఆ ఈవెంట్ లో మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో ఎవరు ? నాని , వరుణ్ తేజ్ అని యాంకర్ ప్రశ్నిస్తే మొహమాటం లేకుండా వరుణ్ తేజ్ పేరు చెప్పింది. అంతేకాదు ఆ పేరు చెబుతూ సిగ్గుల మొగ్గే అయ్యింది. దాంతో లావణ్య త్రిపాఠి తన మనసులో మాట చెప్పిందని , వరుణ్ తేజ్ తో పీకల్లోతు ప్రేమలో ఉందనే సాక్ష్యం ఇదే నని అంటున్నారు.

    లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ఇద్దరూ జంటగా మిస్టర్ , అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే ఆ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఈ ఇద్దరి మనసులు దగ్గరయ్యాయని ఫిలిం నగర్ కొక్కరోకో అని కోడై కూస్తోంది. గతకొంత కాలంగా ఈ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. కట్ చేస్తే ఇప్పుడు లావణ్య మరోసారి వరుణ్ తేజ్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేయడంతో మరికొద్ది రోజులు వార్తలు పుంఖానుపుంఖాలుగా రావడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related