
అగ్ర రాజ్యం అమెరికాలో మహానటుడు , మహా నాయకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పెట్టేందుకు ఎడిసన్ మేయర్ అంగీకరించారు దాంతో అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్బంగా అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలుగువాళ్లు గట్టి ప్రయత్నాలే చేసారు.
ఇక న్యూజెర్సీ ఎడిసన్ మేయర్ సామ్ జోషి భారత సంతతికి చెందిన వారు కావడంతో ఈ ప్రతిపాదనకు వెంటనే ఆమోదం తెలిపారు. అలాగే ఎడిసన్ లో ముఖ్య కూడలిలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అందుకు తగిన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసారు మేయర్.
సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎడిసన్ లో ఏర్పాటు చేయబోతున్నందుకు , అందుకు సహకారం అందిస్తున్న మేయర్ కు కృతఙ్ఞతలు తెలిపారు అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్లు. ఈ కార్యక్రమానికి NASAA ( నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్ ) పూనుకోగా అందుకు తానా కూడా సహకారం అందిస్తోంది.