విజయ్ దేవరకొండ లైగర్ చిత్రానికి కష్టాలు వచ్చి పడ్డాయి. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలను బాయ్ కాట్ అంశం వేధించింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ట్రెండ్ విజయ్ దేవరకొండ చిత్రానికి పట్టుకుంది. లైగర్ చిత్రం ఈనెల 25 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో భారీ విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు దర్శక నిర్మాతలు.
అయితే అనూహ్యంగా boycott liger అంటూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే ఈ విషయాన్ని లైగర్ చిత్ర బృందం మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమా విడుదలకు దగ్గరైన నేపథ్యంలో ఈ ప్రచారం సినిమాని కిల్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్లుండి లైగర్ పై boycott liger అని వైరల్ కావడానికి కారకుడు ఎవరో తెలుసా ….. కరణ్ జోహార్ .
అవును ….. కరణ్ జోహార్ అంటే మండిపడుతున్నారు పలువురు నెటిజన్లు. సినిమా రంగంలో నెపోటిజం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ కూడా వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అంతేకాదు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని అవమానించిన వాళ్లలో కరణ్ జోహార్ కూడా ఉన్నాడట. దాంతో ఇటీవల బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమాని కూడా boycott అంటూ అతడి సినిమాని చీల్చి చెండాడారు నెటిజన్లు. ఇక ఇప్పుడేమో లైగర్ చిత్రానికి ఒక నిర్మాత కరణ్ జోహార్ దాంతో లైగర్ పై పగబట్టారు నెటిజన్లు. మరి సినిమా విడుదల అయితే కానీ తెలీదు వీళ్ళ ప్రచారం వల్ల లాభమా ? నష్టమా ? అన్నది.
Breaking News