వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. పూరీ జగన్నాథ్ బాడ్ కావ్ గాడ్ని కొట్టాలే ……. ఇస్మార్ట్ శంకర్ లాంటి మంచి సినిమాలు తీసిన బాడ్ కావ్ గాడు ఇలాంటి సినిమా చేసుడేంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్ల వర్షం కురిపించాడు. ఇంతకీ ఏ సినిమా చూసి ఈ మాటలు అన్నాడో తెలుసా …… లైగర్.
ఆగస్టు 25 న లైగర్ చిత్రం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. మైక్ టైసన్ , రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. అయితే ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో సినిమా చూసిన వాళ్ళు తిడుతున్నారు.
అందులో రాంగోపాల్ వర్మ కూడా ఒకడు. వర్మ శిష్యుడే ఈ పూరీ జగన్నాథ్. దాంతో తనకున్న చనువుతో పూరీ గాడు ….. బాడ్ కావ్ అని తిట్టాడు. కానీ సోషల్ మీడియాలో అది రాంగ్ మెసేజ్ గా వెళుతోంది. లైగర్ చిత్రానికి ఇప్పటికే భారీ డామేజ్ జరిగింది. ఎంత హంగామా చేసినప్పటికీ సినిమాలో విషయం లేకపోవడంతో ప్లాప్ గా తేల్చేసారు ప్రేక్షకులు.
Breaking News