రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు లైగర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే లైగర్ పాన్ ఇండియా చిత్రం అలాగే కష్టాల్లో ఉన్న పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
ఇలా లైగర్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి , అనుష్క కూడా ఉన్నారు. పలువురు నటీనటులు , దర్శక నిర్మాతలు కూడా లైగర్ హిట్ కావాలని ఆశిస్తున్నారు.ఇక ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. ఇప్పటికైతే ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అదిరిపోయాయి.
మరికొద్ది గంటల్లోనే ఓవర్ సీస్ లో షోలు పడనున్నాయి దాంతో తెల్లవారుఝామునే లైగర్ టాక్ ఏంటో తెలిసిపోనుంది. ఇప్పటి వరకైతే లైగర్ కు పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. కాకపోతే బాయ్ కాట్ లైగర్ అనేది కూడా ట్రెండింగ్ లో ఉంది. సినిమా ఏమాత్రం బాగున్నా బ్లాక్ బస్టర్ అవుతుంది. లేకపోతేనే బాయ్ కాట్ లైగర్ అనేది మరింతగా వైరల్ అవుతుంది. లైగర్ రాత ఎలా ఉందో కొద్ది గంటల్లో తేలనుంది.
Breaking News