లైగర్ చిత్రం కోసం మూడేళ్ళ పాటు కష్టపడ్డామని , కానీ అలా థియేటర్ లో రిలీజ్ కాగానే ఇలా ప్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది ఛార్మి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రాన్ని ఛార్మి , కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఆగస్టు 25 న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాము ఈ సినిమా కోసం ఎన్నో కష్టాలు పడ్డామని , మూడేళ్ళ పాటు అష్టకష్టాలు పడి ఈ చిత్రాన్ని నిర్మిస్తే రిజల్ట్ అందుకు విరుద్దంగా ఉందని , ఇక కొంతమంది ముందే ప్లాప్ అంటూ ప్రచారం చేసారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకదశలో కన్నీళ్ల పర్యంతం అయ్యింది ఛార్మి. 20 ఏళ్ల పాటు పడిన కష్టాన్ని లైగర్ కోసం పెట్టుబడులుగా పెట్టామని , అయితే మా కష్టమంతా వృధా అయ్యిందనే బాధ ఎక్కువగా ఉందని అంటోంది.
విజయ్ దేవరకొండ , అనన్య పాండే , మైక్ టైసన్ , రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోతున్నారు. 120 కోట్ల బిజినెస్ జరుగగా ఈ చిత్రానికి కనీసం 30 కోట్ల షేర్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు కనీసం 90 కోట్ల మేర నష్టపోయేలా కనిపిస్తోంది.
Breaking News