రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం ఈనెల 25 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ , మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే లైగర్ సినిమా ప్రారంభం అయిన రోజునే ఓ ఓటీటీ సంస్థ ఏకంగా 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారట. తమ చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో 200 కోట్ల భారీ ఆఫర్ మమ్మల్ని టెంప్ట్ చేసింది కానీ మేము మాత్రం ఎలాంటి టెంప్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఓటీటీ లో విడుదల కావాల్సిన సినిమా కాదు థియేటర్ లలోనే విడుదల కావాలి. అంతేకాదు ఇది 200 కోట్ల ఫిగర్ స్టార్టింగ్ ఫిగర్ మాత్రమే అని చెప్పాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.
అంటే వాళ్ళ దృష్టిలో లైగర్ వందల కోట్లు వసూల్ చేస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఓటీటీ భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించి థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. అయితే పూరీ జగన్నాథ్ – ఛార్మి ల నిర్ణయం తప్పా ? ఒప్పా ? అన్నది ఈనెల 25 న తేలనుంది. సూపర్ హిట్ అయితే ఎక్కువ వసూల్ చేస్తుంది . లేకపోతే లైగర్ టీమ్ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. అది ఏంటి ? అన్నది ఈనెల 25 న తేలనుంది.
Breaking News