రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్టు 25 న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అటు నిర్మాతలను ఇటు ఈ సినిమా కొన్న బయ్యర్లను కూడా నట్టేట ముంచింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాల్చీ తన్నేయడంతో వెంటనే ఓటీటీ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లైగర్ చిత్రాన్ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను సెప్టెంబర్ 30 న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ వెల్లడించనుంది. మాములుగా అయితే పెద్ద సినిమాలు 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కి ఇవ్వాలని నిర్ణయించింది చిత్ర పరిశ్రమ. అయితే అందుకు భిన్నంగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎందుకంటే లైగర్ డిజాస్టర్ అయ్యింది కాబట్టి. మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇలా త్వరగానే ఓటీటీ లోకి వస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఒకప్పటి హాట్ భామ రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.