భారీ అంచనాల మధ్య వచ్చిన లైగర్ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 25 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి రోజునే భారీ దెబ్బ పడింది. మార్నింగ్ షో నుండే డిజాస్టర్ టాక్ రావడంతో ఒక్కసారిగా వసూళ్లు తగ్గిపోయాయి. మూడో రోజునే చాలా చోట్ల లైగర్ చిత్రాన్ని తీసేసారు. దాంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు.
ఈ సినిమాను కొన్నవాళ్ళు దారుణంగా నష్టపోవడంతో బయ్యర్లు దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు మా నష్టాన్ని తిరిగి ఇవ్వాలంటూ. దాంతో ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ గా 35 కోట్లు అందుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దాంతో రెమ్యునరేషన్ లో 6 కోట్లు తిరిగి ఛార్మికి ఇచ్చేశాడట విజయ్ దేవరకొండ.
భారీ నష్టాలు వచ్చాయి కాబట్టి బయ్యర్లకు తలా కొంత తిరిగి ఇవ్వాలని అనుకున్నారట పూరీ జగన్నాథ్ – ఛార్మిలు . అందుకే వాళ్లకు 6 కోట్లు ఇచ్చాడట రౌడీ హీరో. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం నగర్ సర్కిల్లో వైరల్ గా మారింది. అప్పట్లో భారీ ప్లాప్ లు ఎదురైనప్పుడు రజనీకాంత్ , చిరంజీవి , పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు తమ రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చారు. ఇపుడు ఆ కోవలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా చేరాడు.
Breaking News