రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి – కరణ్ జోహార్ లతో కలిసి నిర్మించారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నిన్న విడుదలైన తర్వాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది లైగర్.
రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు బాలీవుడ్ లో కూడా లైగర్ కు గట్టి దెబ్బే పడింది. అసలే బాయ్ కాట్ లైగర్ అనేది బాగా వైరల్ అయ్యింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ లభించాయి. అయితే సినిమాకు టాక్ ఘోరంగా రావడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ పడిపోయాయి. దాంతో ఈ సినిమాను కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమాను అమెజాన్ వాళ్ళు 200 కోట్లకు కొనాలని చూశారట. డైరెక్ట్ ఓటీటీ కోసం అడిగారట. అయితే అత్యాశకు పోయిన ఛార్మి – పూరీ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసారు. కట్ చేస్తే థియేటర్ లలో భారీగా విడుదలైన లైగర్ కు చుక్కలు చూపిస్తున్నారు ప్రేక్షకులు. దాంతో పూరీ జగన్నాథ్ కు మరో డిజాస్టర్ లభించింది దీంతో. పూరీ , ఛార్మి , విజయ్ దేవరకొండ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలా కనబడుతోంది పాపం.
Breaking News