రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ ఎప్పుడు రానుందో తెలుసా ……. సెప్టెంబర్ 22 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. సెప్టెంబర్ 22 న అంటే రేపే సుమా ! అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యిందో తెలుసా …… ఆగస్టు 25 న అంటే నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీ లోకి ఎందుకు వస్తుందో తెలుసా ……. అట్టర్ ప్లాప్ కావడమే.
ఆగస్టు 25 న భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ మార్నింగ్ షో నుండే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాను చూడటానికి ఎవరూ రాలేదు. దాంతో పెద్ద ఎత్తున బయ్యర్లు నష్టపోయారు. ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే మోసం కాబట్టి నెల రోజులు కాకుండానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది.
థియేటర్ లలో చూడని వాళ్ళు ఓటీటీ లో హాయిగా చూసేయ్యొచ్చు. విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ విజయ్ దేవరకొండకు తల్లిగా నటించింది. ఇక మైక్ టైసన్ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.