Tanikella Bharani అతి కొద్ది మంది మహా నటుల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు తనికెళ్ల భరణి. సెంటిమెంట్, విలనిజం, కామెడీ ఇలా ఏ పాత్ర అయినా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగల నటుడు తనికెళ్ల భరణి. మొదట్లో ఎన్నో సినిమాలకు రచయితగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తనకు సినిమాలో నటించే అవకాశం లభించింది. నటుడిగా వచ్చిన ప్రతీ అవకాశంను సద్వినియోగ పర్చుకున్నాడు. ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరుగా కొనసాగుతూ ఉన్నాడు.
నటనతో పాటు గా ‘మిథునం’ లాంటి క్లాసిక్ చిత్రంతో ఈయన దర్శకత్వం ను ప్రారంభించారు తనికెళ్ళ భరణి. ఇతడు మహా శివుని నామస్మరణ లో ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన యుక్త వయస్సులో జరిగిన కొన్ని సంఘటనలు, ఎదురైన అనుభవాల గురించి వివరించాడు.
తనికెళ్ల భరణిని ఓ యాంకర్ ‘మీరు టీనేజ్‌లో మంచి పొడవు, కటౌట్ తో చాలా అందంగా ఉండేవారు కదా, మీ వెంట ఎవరైనా అమ్మాయిలు పడ్డారా?’ అని ప్రశ్నించగా.. భరణి దానికి బదులు చెప్తూ ‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్ను ఆరుగురు (అర డజను) మంది యంగ్ హీరోయిన్స్ ప్రేమించారు. నాతో మాట్లాడాలనే నెపంతో వాళ్ల ఇంటి నుంచి లంచ్ బాక్స్ తీసుకొని రావడమో, ఏదో ఒకటి కొని తీసుకురావడం లాంటివి చేసేవారు. కొన్ని లవ్ లెటర్స్ కూడా వచ్చాయి. అవి ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా భార్య ఆ లెటర్స్ చదివింది. ఇలా అందమైన అమ్మాయిలు మీ వెంట పడ్డారు అయినా మీరు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్నించేది’. తనికెళ్ల భరణిని ప్రేమించిన ఆ హీరోయిన్స్ ఎవరు? అనే వివరాలు మాత్రం ఆయన రివీల్ చేయలేదు.