అర్జున్ రెడ్డి , కాంతారా , మజ్ను , మజిలీ , వరుడు కావలెను తదితర చిత్రాలకు పాటలు అందించిన యువ గేయ రచయిత రాంబాబు గోషాల. కేవలం అయిదేళ్ల కాలంలోనే 300 కు పైగా పాటలను రాసి తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి సంచలనం సృష్టించాడు. సూపర్ హిట్ చిత్రాలలో పాటలు రాయడంతో …… అవి ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో ఈ యువ రచయితకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
తనకు ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు వచ్చాయని , వాటిని అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకున్నానని అందుకే పాటలు రాయాలని అవకాశాల కోసం నేను వెతుక్కోవలసిన అవసరం రాలేదన్నాడు. నన్నే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని అందుకు చాలా సంతోషంగా ఉందని …….. అయితే అదే సమయంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు అలాగే సంగీత దర్శకులకు కృతఙ్ఞతలు తెలిపాడు రాంబాబు.
మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ చిత్రాలకు పాటలు రాయడమే తన ధ్యేయమని , ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ……. తప్పకుండా ఆ గోల్డెన్ ఛాన్స్ వస్తుందనే ధీమా వ్యక్తం చేసాడు. ఇక ఇదే సమయంలో యు బ్లడ్ సేవలను తెలుసుకొని UBlood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి సేవాగుణగణాలను కొనియాడాడు. తాజాగా JSW & Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధి అశోక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు రాంబాబు గోషాల.