28 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 850 కి పైగా చిత్రాల్లో 3500 కు పైగా పాటలు రాసాను. ఇన్ని పాటలు రాయడానికి ఎంతో కస్టపడి , ఇష్టపడి , మదనపడి పాటలు రాసాను. అలా కస్టపడి పాటలు రాయగలిగాను కాబట్టే ఈరోజు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోగలిగాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట చంద్రబోస్ రాసిన సంగతి తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట హైలెట్ గా నిలిచింది. ఈ పాట కోసం ఏడాది పాటు కష్టపడ్డారట చంద్రబోస్. ఇక చంద్రబోస్ రాసిన ఈ పాటకు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కూడా చాలా కస్టపడి సంగీతం అందించారు.
రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ కలిసి ఆలపించారు. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. కట్ చేస్తే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈ పాటను వరించింది. దాంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు దక్కింది. దాంతో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక చంద్రబోస్ అయితే తాను రాసిన పాటకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో పరమానందభరితుడౌతున్నాడు.
The winner for Best Song – Motion Picture is @mmkeeravaani for their song “Naatu Naatu” featured in @RRRMovie! Congratulations! 🎥✨🎵 #GoldenGlobes pic.twitter.com/ENCUQEtns3
— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023