టాలీవుడ్ లో వరుస విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలువురు సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ మామ, ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా ( 92 ) నిన్న రాత్రి మణికొండలో మరణించాడు. చాంద్ బాషా సౌత్ లో పలు సినిమాలకు సంగీతం అందించాడు. సుచిత్ర చంద్రబోస్ – చంద్రబోస్ ల దగ్గరే చాంద్ బాషా ఉంటున్నాడు. కూతురు – అల్లుడితో కలిసి ఉంటున్న చాంద్ బాషా మరణించడంతో సుచిత్ర చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చాంద్ బాషా అంత్యక్రియలు ఈరోజు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
Breaking News