
నందమూరి బాలకృష్ణను ఓ పిచ్చోడు హెచ్చరించాడు. ఆ సంఘటన సంచలనంగా మారింది. ఈ సంచలన సంఘటన ఫిలిం ఛాంబర్ లో జరిగింది. నందమూరి తారకరత్న చనిపోవడంతో పార్దీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు తరలించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు , సినీ , రాజకీయ ప్రముఖులు వచ్చారు.
ఇక అదే సమయంలో ఓ పిచ్చోడు తారకరత్న మృతదేహాన్ని చూసిన తర్వాత నేరుగా బాలయ్య దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఉండు ……. అంటూ హెచ్చరించడమే కాకుండా వేలెత్తి మరీ చూపించాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈలోపు పోలీసులు వచ్చి అతడ్ని బాలయ్య దగ్గరకు వెళ్లకుండా అడ్డుకొని అక్కడ నుండి పంపించేశారు.
తీరా ఆ పిచ్చోడు ఎవరు ? అని ఆరా తీస్తే …….. గతకొంత కాలంగా ఫిలిం నగర్ లో తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసింది. దాంతో ఊపిరి పీల్చుకున్నారు. నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. గత ఏడాదే నందమూరి తారకరామారావు చిన్న కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ షాక్ నుండి కోలుకోకముందే తారకరత్న అకస్మాత్తుగా మరణించడం ఆ కుటుంబాన్ని మరింత తీవ్రంగా కలిచి వేసింది.