సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రపంచాన్ని చుట్టేసే సాహసయాత్రికుడిగా మహేష్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో అయితే సెట్ అయ్యాడు మరి హీరోయిన్ ఎవరు ? మహేష్ తో రొమాన్స్ చేసేది ఎవరు ? అనే ప్రశ్న ఉదయించింది.
దర్శకులు రాజమౌళి పరిశీలనలో ఇద్దరు స్టార్ హీరోయిన్ లు ఉన్నారట. ఒకరేమో ఆలియా భట్ కాగా మరొకరు దీపికా పదుకొన్ అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతి. కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే నాటికి అలియా మాములు మనిషి అవ్వడం ఖాయం. కాబట్టి డేట్స్ సమస్య ఎదురు కాదు. అయితే ఆలియా ను సెలెక్ట్ చేస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.
ఇక దీపికా పదుకోన్ విషయానికి వస్తే …….. మహేష్ సరసన దీపికా పదుకోన్ ని ఎంపిక చేయడం ఖాయమని వినిపిస్తోంది. దీపికా పదుకోన్ బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. ఆలియా భట్ ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ లో నటించింది. దాంతో ఈ సినిమాలో దీపికా పదుకోన్ ని ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మహేష్ తో రొమాన్స్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. త్వరలోనే హీరోయిన్ ను ఫైనల్ చేయనున్నారు.