సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ హీరో ” క్రిస్ హేమ్స్ వర్త్ ” నటించనున్నట్లు తెలుస్తోంది. అవెంజర్స్ తో ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించిన ఈ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే అంతకుమించిన ఆనందం ఏముంటుంది మహేష్ అభిమానులకు.
మహేష్ బాబు హాలీవుడ్ హీరోలా ఉంటాడు అనే సంగతి తెలిసిందే. దానికి తోడు మరో హాలీవుడ్ హీరో యాడ్ అవుతుండటంతో తప్పకుండా భారీ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల క్రిస్ హెమ్స్ వర్త్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రావాలని చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశ , కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కూడా ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్రిప్ట్ పక్కాగా రెడీ అవుతోంది. అలాగే నటీనటుల ఎంపిక కూడా త్వరలోనే జరుగనుందట.