టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఈరోజు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. నవంబర్ 15 న కృష్ణ మరణించడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు మహేష్ బాబు. ఈ ఏడాది ప్రథమార్థంలో అన్నయ్య రమేష్ బాబు మరణించగా సెప్టెంబర్ లో తల్లి ఇందిరాదేవి మరణించింది. వాటి నుండి కోలుకోకముందే తండ్రి మరణించడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తండ్రి కర్మకాండలు నిర్వహించిన అనంతరం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి షూటింగ్ కు వెళితే కాస్త ఉపశమనం లభిస్తుందని భావించిన మహేష్ బాబు తాను నటిస్తున్న కొత్త సినిమా కోసం సెట్స్ కు వెళ్ళాడు. వర్క్ మోడ్ లో ఉన్నాను అంటూ ఏకంగా ఓ ఫోటోను కూడా మీడియాకు విడుదల చేసాడు మహేష్ బాబు.
మహేష్ ట్రెండీ లుక్ వైరల్ గా మారడం ఖాయం….. అలా ఉంది మరి ఈ లుక్కు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు మహేష్ . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ గతనెలలో 3 రోజుల పాటు జరిగింది. అయితే ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగకపోవడంతో ఆపేసారు . కట్ చేస్తే తండ్రి కృష్ణ మరణించాడు. దాంతో నవంబర్ లో షూటింగ్ చేయలేకపోయాడు. ఇప్పుడు మనసును కుదుట పరుచుకోవడానికి లొకేషన్ కు వెళితే ఆ జ్ఞాపకాలు వెంటాడని భావించాడట. దాంతో ssmb 28 స్టార్ట్ అయ్యింది.