మహేష్ బాబు తన తల్లి చితాభస్మాన్ని గంగానదిలో కలిపాడు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. తల్లి అంత్యక్రియలను నిర్వహించిన మహేష్ బాబు చితాభస్మాన్ని గంగానదిలో కలపడానికి కుటుంబ సమేతంగా హరిద్వార్ కు చేరుకున్నాడు. అక్కడ గంగానది ఒడ్డున తల్లికి కర్మకాండలను నిర్వహించిన అనంతరం గంగానదిలో తల్లి చితాభస్మాన్ని కలిపాడు.
చనిపోయిన వాళ్ళ చితాభస్మాన్ని గంగలో కలపడం , ఆత్మకు విముక్తి కల్పించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. అందుకే తల్లి చితాభస్మాన్ని గంగలో కలిపాడు మహేష్ బాబు. పూజా కార్యక్రమాలు అయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చింది మహేష్ కుటుంబం. మహేష్ బాబుకు తల్లి అంటే ఎనలేని ప్రేమ అలాగే తల్లి ఇందిరాదేవికి కూడా చిన్న కొడుకు మహేష్ అంటే వల్లమాలిన ప్రేమ.
మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ రెండు రోజులు జరుపుకుంది. షెడ్యూల్ ఆశించిన స్థాయిలో లేదని భావించి షూటింగ్ ఆపేసారు. అయితే ఈ నెలలో మళ్ళీ షూటింగ్ అనుకున్నారు కానీ ఇప్పట్లో సెట్స్ మీదకు వేళ్తాడో లేదో చూడాలి.