
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , నమ్రత కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారట. ఇప్పటికే ఏషియన్ వాళ్లతో కలిసి మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు. హైదరాబాద్ లో ” AMB ” అనే మల్టీప్లెక్స్ విశేష ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వస్త్ర ప్రపంచంలోకి కూడా అడుగు పెట్టాడు మహేష్ బాబు.
ఇక తాజాగా హోటల్ రంగంలోకి కూడా మహేష్ అడుగుపెడుతున్నట్లు సమాచారం. మినర్వా వాళ్లతో కలిసి సంయుక్తంగా హోటల్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ పేరులో తన భార్య నమ్రత పేరు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ”మినర్వా ఏ. ఎన్ ” అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ అంటే నమ్రత దాంతో తన భార్య పేరు హోటల్ పేరులో ఉండాలని పట్టుబట్టాడట మహేష్.
ఇప్పటికే మహేష్ సంపాదిస్తున్న సొమ్ము ను రకరకాల మార్గాల్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను ఆర్జిస్తోంది నమ్రత. తన తెలివి తేటలతో మహేష్ సంపాదిస్తున్న డబ్బును అంతకు పదింతలు వచ్చేలా పెట్టుబడులు పెడుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే …… ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.