ఐ లవ్ యు నాన్న …… నువ్వే నా సూపర్ స్టార్ అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. హీరో కృష్ణ చనిపోయి నేటికి 10 రోజులు కావడంతో తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు మహేష్.
మీ లైఫ్ ఒక సెలబ్రేషన్స్ లా సాగింది……. అంత్యక్రియలు కూడా అంతకుమించిన ఘన నివాళి లభించింది. భయానికే మీనింగ్ తెలియని ధోరణితో డేరింగ్ , డాషింగ్ నిర్ణయాలతో ప్రయాణాన్ని సాగించారు. అదే స్ఫూర్తితో నేను మీ లెగసీని ముందుకు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరింత గర్వించేలా నా సినీ జీవిత ప్రయాణం ఉంటుంది.
లవ్ యు నాన్నా ….. మీరే నా సూపర్ స్టార్ అంటూ అభిమానులను అలరించేలా , భావోద్వేగానికి లోనయ్యేలా అభిమానుల మనసును తట్టి లేపాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ లేఖను చూసి కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు…… అన్నా ….. మీకు అండగా ఉన్నామంటూ స్పందిస్తున్నారు.