దర్శకులు పూరీ జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. మహేష్ ఫ్యాన్స్ కు పూరీ జగన్నాథ్ పై కోపం ఎందుకో తెలుసా ……. పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలకు సీక్వెల్ చేయాలని ఉందని , అయితే అందుకు మహేష్ బాబు ఒప్పుకుంటాడో ? లేదో ? అని సందేహం వ్యక్తం చేసాడు ఇటీవల. అది మహేష్ ఫ్యాన్స్ కు నచ్చలేదు దాంతో ఆగ్రహిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలు వచ్చాయి. పోకిరి చిత్రం మహేష్ కెరీర్ పూర్తిగా మార్చేసింది. తిరుగులేని స్టార్ అయ్యాడు. అంతేకాదు పోకిరి చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో బిజినెస్ మెన్ చిత్రం చేసారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ చేయాలని కసిగా ఉన్నాడట పూరీ.
అయితే గతకొంత కాలంగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో చేసిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతున్నాయి దాంతో మహేష్ బాబు పూరీ కి ఛాన్స్ ఇవ్వలేదు. ఆ కసితో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రం చేసాడు. కట్ చేస్తే అది సూపర్ హిట్ అయ్యింది. దాంతో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లైగర్ చిత్రం చేసాడు. ఈరోజు ఆ సినిమా విడుదల అయ్యింది. మరి లైగర్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Breaking News
MAHESH BABU- PURI JAGANNADH:పూరీ జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్
Date: